లండన్ ఫిల్మ్ ఫెస్టివల్లో మణిరత్నం కి పురష్కారం

లండన్ ఫిల్మ్ ఫెస్టివల్లో మణిరత్నం కి పురష్కారం

Published on Jul 20, 2015 1:31 PM IST

mani-ratnam

సౌత్ ఇండియన్ మోస్ట్ ఫేమస్ డైరెక్టర్ మణిరత్నం. తను దర్శకత్వం వచించిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘బొంబాయి’ని ప్రస్తుతం జరుగుతున్న లండన్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో గత రాత్రి ప్రదర్శించారు. ఈ వేడుకకి అటెండ్ అయిన మణిరత్నం ఈ షో తర్వాత న్యూ ఫిల్మ్ మేకర్స్ మరియు సినీ ప్రేమికులను ఉద్దేశించి మాట్లాడుతూ తన పర్సనల్ లైఫ్, కెరీర్, సినిమా నిర్మాణం మరియు తను పనిచేసిన కొంతమంది యాక్టర్స్ గురించి చెప్పారు. అంతే కాకుండా లండన్ ఇండిన ఫిల్మ్ ఫెస్టివల్ వారు మణిరత్నంని స్పెషల్ గా పురష్కరించారు.

అంతే కాకుండా ఆయన సినిమాలు మరింత ప్రాచుర్యం పొందాదాలనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ వారు ఓ ప్రత్యేక హోదాని కల్పించారు. అదే జూలై 31 నుంచి ఆగష్టు 2 వరకూ అమెరికాలోని న్యూ యార్క్ లో జరగనున్న ది మ్యూజియం ఆఫ్ మూవింగ్ ఇమేజ్ ఫెస్టివల్ లో మణిరత్నం తీసిన రోజా, బొంబాయి, దిల్ సే సినిమాలను ప్రదర్శించనున్నారు. ఈ సినిమాల తర్వాత మణిరత్నం అక్కడి వారు అడిగే ప్రశ్నలకి జవాబులు కూడా ఇవ్వనున్నాడు. ఈ విషయం పక్కన పెడితే మణిరత్నం మరోవైపు తన తదుపరి సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. కార్తీ, దల్క్వేర్ సల్మాన్, నయనతార, శృతి హాసన్ లు ముఖ్య పాత్రలు పోషించనున్న ఈ సినిమా డిసెంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది.

తాజా వార్తలు