రామ్ చరణ్, బన్నిలతో మణిరత్నం మల్టీ స్టారర్ మూవీ?

ram-charan-allu-arjun
గత కొంత కాలంగా టాలీవుడ్ లో వినిపిస్తున్న క్రేజీ కాంబినేషన్ నాగార్జున – మహేష్ బాబు – మణిరత్నం. ఈ కాంబినేషన్ లో మూవీ సెట్స్ పైకి వెళ్తుందని సుహాసిని మణిరత్నం కూడా అనడంతో అందరూ ఈ సినిమా రూపొందుతుందని అనుకున్నారు. కానీ ఈ సినిమాని పక్కన పెట్టాం అని ఇటీవలే నాగార్జున చెప్పడంతో ఇక ఈ క్రేజీ సినిమా ఇక లేనట్లే అని అందరూ ఫిక్స్ అయ్యారు.

కానీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో మహేష్ బాబు – నాగార్జున బదులుగా రామ్ చరణ్ – అల్లు అర్జున్ లను తీసుకోవాలని అనుకుంటున్నట్టు సమాచారం. అందులో భాగంగానే మణిరత్నం గత కొద్ది రోజులుగా హైదరబాద్ లోనే చిరంజీవి, అల్లు అరవింద్ తో కలిసి ఉన్నారు. అంతే కాకుండా మణిరత్నం చెప్పిన స్టొరీ లైన్ చిరు కి మాగా నచ్చిందని సమాచారం. అన్నీ కుదిరితే ఈ సినిమా రామ్ చరణ్, అల్లు అర్జున్ హీరోలుగా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.

ఒకవేళ ఇదే గనుక నిజమైతే మరో మల్టీ స్టారర్ సినిమాలో మెగా హీరోలను చూడొచ్చు. రామ్ చరణ్ – అల్లు అర్జున్ కలిసి నటించిన మల్టీ స్టారర్ మూవీ ‘ఎవడు’ ఈ సంవత్సరమే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Exit mobile version