
‘ఒక కథను మూడు నిముషాల్లో చెప్పడం కుదరకపోతే అది కథ కాదు.’ ఇది మణిరత్నం డైలాగ్. తన సినిమాల్లో మాటల తరహాలో కథను కూడా చాలా షార్ప్ & సింపుల్ గా ఇతరులకు నేరేట్ చేస్తారట. ఈ విషయాన్నీ తమిళంలో మణిరత్నం సినిమాలకు పాటలు రాసే ప్రముఖ రచయిత వైరముత్తు తాజా ఇంటర్వ్యూలో చెప్పారు.
మణిరత్నం కథను చెప్పే విధానం చాలా అసాధారణంగా ఉంటుంది. మూడు నిముషాలు కంటే కథను ఎక్కువ సేపు చెప్పరు. షార్ప్, క్రిస్పీగా మణిరత్నం నేరేషన్ స్టైల్ ఉంటుంది. అని వైరముత్తు తెలిపారు. త్వరలో విడుదల కానున్న ‘ఓకే కన్మణి’ సినిమాకు ఈయనే పాటల రచయిత.
ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ సినిమా ఆడియో ఈ వారమే విడుదల కానుంది. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ జంటగా నటించారు.