
చాలా రోజుల తర్వాత ‘ఓకే కన్మణి లేదా ఓకే బంగారం’ సినిమాతో హిట్ అందుకున్న సౌత్ ఇండియన్ సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ మణిరత్నం. ఈ సినిమా సక్సెస్ ఇచ్చిన ఎనర్జీతో మణిరత్నం తన తదుపరి చిఎన్మా కోసం సిద్దమవుతున్నాడు. అది కూడా తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన జూనియర్ తో సినిమా చేసే ఆలోచనలో ఉండడం విశేషం. ఇంతకీ ఆ అసిస్టెంట్ ఎవరు అనుకుంటున్నారా.. ‘ఆవారా’ సినిమాతో తెలుగు, తమిళంలో స్టార్ హీరోగా మారిన కార్తీనే ఆ అసిస్టెంట్. కార్తీ హీరోగా రాకముందు డైరెక్టర్ అవ్వాలని మణిరత్నం చేసున యువ సినిమాతో ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు.
కానీ అనుకోకుండా కార్తీ మాత్రం హీరో అయ్యాడు. ఇప్పటికే మణిరత్నం చెప్పిన లైన్ నచ్చడంతో కార్తీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. మణిరత్నం ఒకేసారి తమిళ్ – మలయాళ భాషల్లో చేయనున్నారు. ఈ ద్విభాషా చిత్రం మలయాళ వెర్షన్ లో మమ్ముట్టి ఓ మెయిన్ రోల్ లో కనిపించనున్నాడు. ఎప్పటిలానే ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించనున్నాడు. గతంలో మణిరత్నం తన దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన సిద్దార్థ్ తో యువ సినిమా చేసాడు. ఇప్పుడు మరో అసిస్టెంట్ కార్తీ తో సినిమా చేయనున్నాడు.