99.9% కంప్లీట్ అయిన మణిరత్నం సినిమా

Mani-Ratnam
మలయాళ నటుడు మమ్ముట్టి వారసుడు దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ జంటగా నటిస్తున్న సినిమా ‘ఓకే కన్మణి’. క్రియేటివ్ జీనియస్ మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు. మణిరత్నం కెరీర్ లో అత్యంత వేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంటున్న సినిమాగా ‘ఓకే కన్మణి’ రికార్డులకు ఎక్కబోతుంది. అప్పుడే ఈ సినిమా షూటింగ్ 99 .9% కంప్లీట్ అయ్యిందని సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

2015 ప్రధమార్ధంలో ఈ సినిమా విడుదలవుతుందని పిసి శ్రీరామ్ చెప్పారు. ప్రకాష్ రాజ్, కనిక కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. మణిరత్నం మార్క్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.

Exit mobile version