మన్మథుడు 2 సెకండ్ షెడ్యూల్ అప్డేట్ !

Manmadhudu 2

సూపర్ హిట్ మూవీ మన్మథుడు కి సీక్వెల్ గా రూపొందతున్న చిత్రం మన్మథుడు 2. కింగ్ నాగార్జున , ‘చి ల సౌ’ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ కలయికలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నిన్నటి తో హైదరాబాద్ లో మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇక ఈ చిత్రం యొక్క రెండవ షెడ్యూల్ ఈ నెల 11 నుండి యూరప్ లో జరుగనుంది. ఈ చిత్రంలో నాగ్ కు జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా వెన్నల కిషోర్,రావు రమేష్ , ఝాన్సీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ఆర్ఎక్స్ 100 ఫేమ్ చైతన్ భరద్వాజ్ సంగీతంఅందిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తుంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం దసరా సీజన్లో విడుదలకానుంది.

Exit mobile version