వెటరన్ క్రికెటర్ తో “మన్మథుడు” బ్యూటీ చర్చ..

Anshu

టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా నటించిన పలు హిట్ చిత్రాల్లో క్రేజీ హిట్ “మన్మథుడు” కూడా ఒకటి. మరి ఈ చిత్రంలో నాగార్జున సరసన నటించిన ఇద్దరు హీరోయిన్స్ లో అన్షు సాగర్ కూడా ఒకరు. మరి ఆమె మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా కనిపిస్తూ ఉండడంతో నెటిజన్స్ లో ఆమె పేరు వినిపిస్తూ వస్తుంది. అయితే తాజాగా ఈమె ప్రముఖ వెటరన్ క్రికెటర్ అలాగే లోక్ సభ సభ్యులు అయినటువంటి మొహమ్మద్ అజారుద్దీన్ ని కలిసిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి.

అయితే ఆమె అజారుద్దీన్ ని కలిసి కొంతసేపు చర్చించినట్టుగా తెలుస్తుంది. అలా ఆ సమయంలో ఇద్దరూ తీసుకున్న పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే అన్షు రీసెంట్ గానే కింగ్ నాగ్ ని కూడా కలిసిన పిక్స్ బయటకి వచ్చి బాగా వైరల్ అయ్యిన సంగతి కూడా తెలిసిందే. మరి ఇపుడు ఆమె అజారుద్దీన్ ని కలవడం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

Exit mobile version