
విక్రమ్ హీరోగా సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన తమిళ సినిమా ‘ఐ’. తెలుగులో ‘మనోహరుడు’ పేరుతో ఈ సినిమాను అనువదిస్తున్నారు. 180 కోట్ల భారి బడ్జెట్ తో అస్కార్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై అస్కార్ రవిచంద్రన్ నిర్మించిన ఈ శాటిలైట్ హక్కులు 22 కోట్లకు అమ్ముడయ్యాయని సమాచారం. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు చెందిన జయటీవీ 22 కోట్లు పెట్టి ‘ఐ’ శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకున్నారని చెన్నై మీడియా టాక్. అధికారికంగా ఎవరూ ఈ వార్తను ప్రకటించలేదు.
అస్కార్ అవార్డు గ్రహిత ఎఆర్ రెహమాన్ స్వరపరిచిన ‘ఐ’ ఆడియో సెప్టెంబర్ 15న విడుదల చేస్తున్నారు. హలీవుడ్ నటుడు అర్నాల్డ్ షార్జ్ నెగ్గర్ ముఖ్య అతిధిగా హాజరవుతున్నారు. తెలుగు ఆడియో విడుదలకు జాకీ చాన్ ను రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీపావళి కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 22న విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో అమీ జాక్సన్ హీరోయిన్.