త్వరలో విలన్ పాత్రలో కనిపిస్తా: మంచు మనోజ్

Current-Teega
మంచు మనోజ్ అంటే యాక్టీవ్ నెస్ కి పెట్టింది పేరు. అతని నటన హై వోల్టేజ్ లో సాగుతుంది. మనోజ్ తాజా చిత్రం ‘కరెంట్ తీగ’ నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ.

మంచు మనోజ్ ఈ సందర్భంగా తన మనసులోని కోరికల్ని బయటపెట్టాడు. తనకు విలన్ పాత్రలో నటించడం అంటే చాలా ఇష్టమని, త్వరలో అలాంటి చేయబోతున్నానని తెలిపాడు. అంతేకాక దాసరి, కె విశ్వనాధ్, రామ్ గోపాల్ వర్మల సినిమాలు చూస్తూ పెరిగానని వాళ్ళ దర్శకత్వంలో ఎప్పటికైనా ఒక సినిమా చెయ్యాలని తన మనసులో మాటను బయటపెట్టాడు. మరి మనోజ్ కోరిక నిజమవ్వాలని, కరెంట్ తీగ హిట్ అవ్వాలని కోరుకుందాం

Exit mobile version