మనోజ్ పెళ్ళికి హాజరైన అతిరధ మహారధులు

manchu-manoj-pranitha
గత కొద్ది రోజులుగా పెళ్లి సంబరాలు చేరుకుంటున్న మంచు వారి పెళ్లి సందడి నేటితో చివరి అంకానికి చేరుకుంది. డా. మంచు మోహన్ బాబు చివరి తనయుడు మంచు మనోజ్ వివాహ మహోత్సవం ఈ రోజు ఉదయం 9గంటల 10 నిమిషాలకు హైదరాబాద్ లోని హైటెక్స్ లో జరిగింది. తెలుగు సాంప్రదాయం ప్రకారం అన్ని లాంచనాలతో అంగరంగ వైభవంగా మనోజ్ వివాహం జరిగింది. ఈ వేడుకకి అటు సినీ పరిశ్రమ నుండి, ఇటు రాజకీయ పార్టీక నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

రాజకీయ పార్టీ అధినేతలైన నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలతో పాటు గవర్నర్ నరసింహన్ కూడా ఈ వేడుకకి హాజరయ్యారు. వీళ్ళతో పాటు స్టేట్ అండ్ నేషనల్ లెవల్ రాజకీయ నాయకీలు కూడా వచ్చి వధూవరులను ఆశీర్వదించారు. ఇక సినీ పరిశ్రమ నుండి రజినీకాంత్, నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, సూర్య, దాసరి నారాయణ రావు, రాఘవేంద్ర రావు, రామోజీ రావు, సుబ్బరామిరెడ్డి, ఇళయరాజా, శ్యాం ప్రసాద్ రెడ్డి, కోట శ్రీనివాసరావు, శ్రీకాంత్, అలీ, పరుచూరి బ్రదర్స్ తదితరులు హాజరయ్యారు. ఇలా స్టార్స్ అందరి సమక్షంలో మోహన్ బాబు తన కుమారుడి మనోజ్ పెళ్లిని చాలా ఘనంగా చేసారు.

Exit mobile version