
మంచు విష్ణు బ్యానర్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నుండి గత ఏడాది మంచి హిట్ ని అందించిన మంచు మనోజ్ మరియు దర్శకుడు నాగేశ్వర రెడ్డి మరోసారి జతకట్టనున్నారు.
వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘కరెంట్ తీగ’ మంచి విజయం సాధించడంతో మరోసారి యాక్షన్ కామెడీ జోనర్ నే ఎంచుకోనున్నారు.
ఈ ప్రాజెక్ట్ పై నిర్మాణ సంస్థ పూర్తి నమ్మకం వ్యక్తం చేసింది. స్క్రిప్ట్ వర్క్ లో విలక్షణత కనిపించినట్టు తెలిపారు. ఈ కధకు ఇద్దరు హీరోయిన్లు అవసరమట. వారి వివరాలు త్వరలోనే తెలియజేస్తారు.