‘మనం’ మూడు వారాల కలెక్షన్ రిపోర్ట్

Manam_Review
ఒకే ఫ్యామిలీ, ముగ్గురు హీరోలు, వీళ్ళంతా కలిసి ఒకే సారి తెరపై కనపడితే అభిమానుల ఆనందానికి అవధులే ఉండవు. అలా అక్కినేని ఫ్యామిలీ ముగ్గురు హీరోలు కలిసి చేసిన సినిమా ‘మనం’. మే 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విడుదలైన అన్ని చోట్లా సూపర్ హిట్ టాక్ తో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సినిమా విడుదలై ఇది నాలుగోవారం కానీ కలెక్షన్స్ మాత్రం తగ్గలేదు.

మేము నిన్నటి వరకూ ఇండియా మొత్తంగా ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ రిపోర్ట్ ని మీకందిస్తున్నాం. నిన్నటి వరకూ ఈ సినిమా ఓవరాల్ గా 23. కోట్ల షేర్ సంపాదించింది. ఏరియాల వారీ గా కలెక్షన్ వివరాలు..

ఏరియా కలెక్షన్
నైజాం 8.97 కోట్లు
సీడెడ్ 3.33 కోట్లు
వైజాగ్ 2.66 కోట్లు
గుంటూరు 1.75 కోట్లు
కృష్ణా 1.64 కోట్లు
నెల్లూరు 73 లక్షలు
పశ్చిమ గోదావరి 1.21 కోట్లు
తూర్పు గోదావరి 1.58 కోట్లు
కర్ణాటక 1.70 కోట్లు
తమిళ నాడు & కేరళ 35 లక్షలు
నార్త్ ఇండియా 4 లక్షలు
ఇండియా మొత్తం షేర్ 23.98 కోట్లు
Exit mobile version