మా సినిమాల్లో కామియో కోసం ఎవరూ రావట్లేదు.. కన్నడ స్టార్ హీరో ఆవేదన

sudeep

ఇప్పుడు దక్షిణాది సినిమా దగ్గర మాత్రమే కాకుండా ఇండియన్ సినిమా దగ్గర కూడా బిగ్గెస్ట్ సినిమా ఇండస్ట్రీగా నిలిచిన ఇండస్ట్రీలలో కన్నడ సినిమా కూడా ఒకటి. అయితే కన్నడ సినిమా నుంచి సుదీప్, శివ రాజ్ కుమార్ లాంటి స్టార్స్ ఇతర భాషల్లో సాలిడ్ కామియో రోల్స్ చేసిన సంగతి తెలిసిందే. కానీ తాము చేసినట్టు ఇతర ఇండస్ట్రీలో నుంచి ఎవరూ తమ కోసం తమ సినిమాల్లో కామియో రోల్స్ చేసేందుకు రావడం లేదని తను ఆవేదన చెందుతున్నారు.

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. నేనే చాలా సినిమాల్లో కనీసం ఎలాంటి పేమెంట్ తీసుకోకుండా నటించాను కానీ తను పర్శనల్ రిక్వెస్ట్ చేసినప్పటికీ ఎవరూ తమ సినిమాల్లో నటించేందుకు ముందుకు రాలేదని సుదీప్ తెలిపారు. పరస్పర సాయం అనేది లోపించినట్టు సుదీప్ తెలిపారు. దీనితో తన షాకింగ్ కామెంట్స్ వైరల్ గా మారాయి.

Exit mobile version