
‘ప్రేమకథా చిత్రమ్’తో హారర్ కామెడీ జోనర్ ను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు దర్శకుడు మారుతి. ఆ తర్వాత తెలుగులో అందరూ హారర్ కామెడీ ట్రెండ్ ఫాలో అయ్యారు. ఇటీవల కాలంలో హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమాలు మంచి విజయాలు సాధించాయి. తాజాగా మరో కొత్త జోనర్ ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసే పనిలో ఉన్నారు మారుతి.
నా దర్శకత్వంలో యువ హీరో నాని నటించబోయే సినిమా కొత్త జోనర్ లో ఉంటుంది. త్వరలో ఈ సినిమా వివరాలు వెల్లడిస్తాను అని మారుతి తెలిపారు. ఒకే జోనర్ లో సినిమాలు చేయడం నాకు ఇష్టం ఉండదు, ఎప్పటికప్పుడు జోనర్ లు మారుస్తూ ఉంటాను. 2 కోట్ల పెట్టుబడితో 10 కోట్లు వసూలు చేసే సత్తా గల సినిమాలను తెరకెక్కించడానికి ఆసక్తి చూపిస్తాను. అని మారుతి అన్నారు.