మళ్ళీ ప్రొడక్షన్ వైపు వచ్చిన మారుతి

maruthi
రీసెంట్ టైమ్స్ లో టాలీవుడ్ లో చిన్న బడ్జెట్ సినిమాలతో పెద్ద హిట్స్ అందుకొని మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా అనిపించుకున్నాడు మారుతి. మొదటి నుంచి మారుతి డైరెక్టర్ గానే కాకుండా మారుతి టాకీస్ బ్యానర్ పై లో బడ్జెట్ సినిమాలు చేయడం లేదా పలువురు నిర్మాతలతో కలిసి సినిమాలు చేస్తున్నాడు. మారుతి పేరుని వాడుకొని ఎక్కువగా అడల్ట్ కామెడీ తరహా సినిమాలే ఎక్కువ వస్తుండడం వలన మారుతి తన బ్యానర్ లో సినిమాలు చేయకూడదని ప్రొడక్షన్ ని ఆపేశారు.

ఏడాదిన్నర తర్వాత మళ్ళీ మారుతి నిర్మాణంలోకి అడుగుపెడుతూ ఓ లో బడ్జెట్ సినిమాని ప్లాన్ చేసాడు. మురళీ కృష్ణ ని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ క్రైమ్ కామెడీ నేపధ్యంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో దృశ్యం ఫేం కృతిక జయకుమార్ హీరోయిన్ గా కనిపించనుంది. ‘రోజులు మారాయి’ అనే తిలే తో రానున్న ఈ సినిమాలో పలు ఇబ్బందుల్లో చిక్కుకున్న ఓ అమ్మాయి ఎలా భయటపడింది అనేదే ప్రధానాంశం. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను అనౌన్స్ చేస్తారు.

Exit mobile version