
ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్న దర్శకుడు ఎవరూ అంటే, టక్కున గుర్తోచే పేరు, మారుతి. అయన దర్శకత్వం వహించిన ‘కొత్త జంట’ సినిమా 25 రోజులు పూర్తి చేసుకున్న సందర్బంగా ఒక చిన్న సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ సినిమా గురించి నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ మారుతి పనితీరు బాగా నచిందని, త్వరలో తమ బ్యానర్ లో అతని దర్శకత్వంలో మరో సినిమా తీస్తానని అన్నారు.
‘కొత్త జంట’ సినిమాతో మారుతి అల్లు శిరీష్ కు మంచి బ్రేక్ ఇచ్చాడు. రెజీనా హీరోయిన్ గా నటించిన ‘కొత్త జంట’ ఇద్దరు స్వార్ధపరుల మధ్య జరిగే ఒక ప్రేమ కథ.