సునీల్ నటించిన సినిమాలలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మర్యాద రామన్న’ ది బెస్ట్ ఫిల్మ్. ఆ సినిమా రేంజ్లో సునీల్ కు సక్సెస్ అందించే సినిమాను మా బ్యానర్లో నిర్మించాలనే ఉద్దేశ్యంతో చేస్తున్న సినిమా ఇది అన్నారు నిర్మాత దిల్ రాజు. సునీల్ హీరోగా ‘జోష్’ ఫేం వాసు వర్మ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కనున్న 19వ సినిమా ప్రారంభోత్సవం భుదవారం హైదరాబాద్లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి శ్యామ్ ప్రసాద్ రెడ్డి క్లాప్ కొత్తగా అల్లు అరవింద్ గౌరవ దర్శకత్వం వహించారు. కీరవాణి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
అనంతరం దిల్ రాజు మాట్లాడుతూ… వాసు వర్మ చాలా టాలెంటెడ్ డైరెక్టర్. జోష్ సినిమాతో వాసు వర్మను దర్శకుడిగా పరిచయం చేశాం. ఆ సినిమా మేం ఆశించిన విజయం సాదించలేదు. ఈ సినిమా అతని టాలెంట్ ప్రూవ్ చేసుకునే సినిమా అవుతుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్. విలువలతో కూడిన వినోదాత్మక సినిమా. కోన చక్కని కథను రెడీ చేశారు. సెప్టెంబర్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. ఫెబ్రవరిలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు.
నా కెరీర్లో ఒక మైలురాయిలా నిలిచే సినిమా అవుతుందని భావిస్తున్నాను. పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రమిది అని సునీల్ అన్నారు. నా టాలెంట్ పై నమ్మకం ఉంచిన దిల్ రాజు, సునీల్ గార్లకు థాంక్స్ అని దర్శకుడు వారు వర్మ అన్నారు. ఈ సినిమా ద్వారా దినేష్ సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
