
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘s/o సత్యమూర్తి’ ఏప్రిల్ 9న అత్యధిక ధియేటర్స్ లొ విడుదలై రికార్డు కలెక్షన్లు సాధించి సూపర్‌డూపర్ హిట్ గా నిలిచింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ ‘s/o సత్యమూర్తి’ చిత్రాన్ని భారీ స్థాయిలో తెలుగు లో నిర్మించారు. సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషించారు. ఇతర పాత్రల్లో సింధుతులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్ నటించారు. ఈ చిత్రం ఇటు తెలుగు, అటు కన్నడలొ భారీ కలెక్షన్లు వసూలు చేస్తుంది. స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ కి తెలుగు లో వున్న అభిమానులతో సరిసమానంగా మళయాలం లో కూడా వున్నారు. గతంలో అల్లు అర్జున్ నటించిన అన్ని చిత్రాలను అక్కడ భారీ స్థాయిలో ఆదరించారు. ఇప్పుడు ఎన్నో అంచనాలతో విడుదలయ్యి తెలుగులో భారి విజయాన్ని సాధించిన ఈ చిత్రం ప్రమోషనల్ ఈవెంట్ ఈరోజు జరిగింది. అశేష అభిమానుల సమక్షంలో కేరళలో ఎన్నడూ జరగని రీతిలో కొచిన్ లోని లుల్లు మాల్ లో జరిగింది. ఈ ఫంక్షన్ లోనే చిత్ర ఆడియో మళయాలం వెర్షన్ ని కూడా విడుదల చేశారు.తమ అభిమాన హీరో అల్లు అర్జున్ ని చూడటానికి అభిమానులు విశేషంగా హజరయ్యారు. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను ప్రేక్షకులతో కలిసి పంచుకున్నారు చిత్ర యూనిట్. మళయాలంలో ఇఫార్ ఇంటర్నేషనల్ రఫి మధిర నిర్మాతగా సగర్వంగా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
కేరళలో బన్నీకి అభిమానుల వెల్లువ!
కేరళలో బన్నీకి అభిమానుల వెల్లువ!
Published on Apr 21, 2015 6:12 PM IST
సంబంధిత సమాచారం
- బాలీవుడ్ లో సాయి పల్లవి డెబ్యూ సినిమాకి డిజాస్టర్ ఓపెనింగ్స్?
- సమీక్ష : కర – ఆకట్టుకునే పీరియాడిక్ ఎమోషనల్ డ్రామా !
- ‘వార్ 2’ ఎఫెక్ట్.. ఎన్టీఆర్ నీల్ అందుకే ఆలస్యం!
- ‘పెద్ది’ నుంచి మరో లుక్? బుచ్చిబాబు కొత్త ప్లాన్?
- ఎంఎస్ రాజు ‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్
- ‘జైలర్ 2’కి ఫినిషింగ్ టచ్ ఇస్తున్న తలైవర్?
- ‘డ్రాగన్’లో తారక్ మరో ఊహించని లుక్ ప్రిపేర్ చేస్తున్నాడా?
- ఓటిటిలోకి వచ్చేసిన కాంట్రవర్సియల్ పొలిటికల్ సినిమా.. విజయ్ పై పొలిటికల్ సెటైర్ ఎందులో చూడొచ్చంటే!
- ధనుష్ కెరీర్లోనే అతి తక్కువ బుకింగ్స్?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- MI vs SRH IPL 2026: బౌల్ట్, బుమ్రా ఉన్నా వదల్లేదు.. 244 రికార్డ్ ఛేజ్‌లో ముంబై బౌలర్లను ఊచకోత కోసిన సన్‌రైజర్స్!
- కొత్త మార్కెట్లు టార్గెట్ చేస్తున్న ‘వారణాసి’..!
- విక్రమ్ తొమ్మిదేళ్ల డిలే ప్రాజెక్ట్ ‘దృవ నక్షత్రం’కి కొత్త డేట్?
- ఓటిటిలో బ్లాక్ బస్టర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రికార్డ్ రెస్పాన్స్ తో ఊహించని నెంబర్స్
- ఈసారి తగ్గేది లేదు.. ‘పెద్ది’ వర్సెస్ ‘లెనిన్’ బాక్సాఫీస్ క్లాష్ కి ఆల్ సెట్!
- టాక్సిక్ : ఆ డేట్‌పై కన్నేసిన యశ్ అండ్ టీమ్..!
- ‘లెనిన్’ పై కింగ్ నాగ్ రివ్యూ.. రిలీజ్ పై కూడా బిగ్ అప్డేట్!
- ది ప్యారడైజ్ : ఆ ఒక్కదానిపైనే రిలీజ్ భారం..!

