మాస్టర్’ టీజర్ : అంతా మాస్ మసాలానే

Master 2

విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అలాగే విజయ్ సేతుపతి కూడ మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడు. యాక్టింగ్లో ఇద్దరూ ఘనులే. అందుకే వారిద్దరూ తలపడుతున్నారనగానే ప్రేక్షకుల్లో ఒక రకమైన ఆసక్తి క్రియేట్ అయింది. అదే ‘మాస్టర్’ సినిమాకు పెద్ద బెనిఫిట్ అయింది. ‘మాస్టర్’ టీజర్లో విజయ్, విజయ్ సేతుపతి ఇద్దరూ పోటాపోటీగా తలపడుతుంటే తమిళ జనం తెగ ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఈ టీజర్ తెలుగులో కూడ విడుదలైంది.

తెలుగు కోసం అంటూ ప్రత్యేకంగా కొత్త టీజర్ తయారుచేయలేదు. తమిళ టీజర్ నే తెలుగులోకి డబ్ చేసి వదిలారు. అయితేనేం సినిమాలోని మాస్ కంటెంట్ ఫుల్లుగా ఉంది. పక్కా రౌడీ పాత్రలో విజయ్ సేతుపతి, రౌడీ లాంటి ప్రొఫెసర్ పాత్రలో విజయ్ సరిగ్గా సరిపోయారు. రెండు పాత్రలూ బలంగా ఉన్నాయి. అలాంటి పాత్రల్లో మంచి స్టేచర్ ఉన్న నటులు ఢీకొంటే ఎంత మజా వస్తుందో ‘మాస్టర్’ టీజర్ చూస్తే అర్థమవుతుంది. ‘ఖైదీ’ చిత్రంతో మెప్పించిన లోకేష్ కానగరాజ్ ఈ సినిమాను కూడ మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే తెరకెక్కించినట్టు ఉంది. ఇక అనిరుద్ సంగీతం అయితే టీజర్ ప్రభావాన్ని రెట్టింపు చేసేలా ఉంది. మొత్తానికి తెలుగు టీజర్ సినిమా మీద ఆసక్తిని క్రియేట్ చేసేలానే ఉంది. ఈ డబ్ వెర్షన్ ను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద మహేష్ కోనేరు రిలీజ్ చేస్తున్నారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version