‘మాస్ట్రో’ ఇళయరాజాకి స్వల్ప అస్వస్థత

Ilayaraja
1980 నుంచి ఇప్పటి దాకా తన సంగీతంతో సంగీత ప్రియుల్ని ఉర్రూతలూగిస్తున్న ది గ్రేట్ లెజండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ మాస్ట్రో ఇళయరాజా. ఆయన శనివారం సాయంత్రం ప్రెస్ కాన్ఫిరెంస్ ద్వారా ఆయన త్వరలోనే తన పేరు మీద ఓ వెబ్ సైట్ లాంచ్ చేయనున్నట్లు, అ వెబ్ సైట్ ద్వారా అభిమానులు డైరెక్ట్ గా కాంటాక్ట్ లో ఉండవచ్చని తెలిపారు. కానీ ఈ ఈవెంట్ తర్వాత ఓ బాధాకరమైన సంఘటన చోటు చేసుకుంది. అదే ఆయన అస్వస్థతకి గురవ్వడం. ఈ ఈవెంట్ జరిగిన కొద్ది సేపటికి ఆయనకు శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది.

దాంతో ఆయన్ని హుటాహుటిన చెన్నైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ కి తరలించారు. గత కొన్ని నెలల క్రితం ఆయననికి హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చి ఉండడంతో ఆయనకి కార్డియాలజీ విభాగంలో ట్రీట్ మెంట్ చేసారు. అక్కడ అన్ని పరీక్షలు చేసి పెద్ద ప్రమాదం ఏమీ లేదని డాక్టర్స్ తెలిపారు. అలాగే ఆయనకి ప్రేగులో రక్తం గడ్డ కట్టడం వలెనే ఇదంతా జరిగిందని సమాచారం. అందుకే ప్రస్తుతం ఆయన్ని గ్యాస్ట్రో ఎంట్రాలజీ డిపార్ట్ మెంట్ కి షిఫ్ట్ చేసి అక్కడ ట్రీట్ మెంట్ చేస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో ఆయనకి పూర్తిగా నయం అవుతుందని, డిశ్చార్జ్ కూడా చేస్తాం అని వైద్యులు తెలిపారు.

మాస్ట్రో ఇళయరాజా త్వరగా కోలుకోవాలని 123తెలుగు.కామ్ కోరుకుంటోంది.

Exit mobile version