మెగా 158లో మరో రూమర్‌కు చెక్.. ఆ యాక్టర్ నటించడం లేదట..!

Chiru-Boby

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో ఇప్పటికే అనౌన్స్ అయిన ‘మెగా 158’ సినిమా కోసం ప్రేక్షకుల్లో మంచి బజ్ ఏర్పడింది. గతంలో ‘వాల్తేరు వీరయ్య’తో బ్లాక్‌బస్టర్ కాంబోగా పేరుతెచ్చుకున్న వీరిద్దరు మరోసారి పవర్‌ఫుల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమాను అనౌన్స్ చేసిన దగ్గర్నుంచి ఈ మూవీకి సంబంధించి అనేక వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

అయితే, ఇందులో భాగంగా మెగా 158 ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ వెటరెన్ యాక్టర్ అనిల్ కపూర్ ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ వార్తలు నెట్టింట జోరుగా చక్కర్లు కొట్టడంతో మెగా ఫ్యాన్స్ కూడా అనిల్ కపూర్ ఈ సినిమాలో నటిస్తున్నాడని ఫిక్స్ అయ్యారు. కానీ, ఇప్పుడు చిత్ర వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో అనిల్ కపూర్ నటించడం లేదని.. అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అని తేలిపోయింది.

దీంతో మెగాస్టా్ర్ చిరంజీవి సినిమాలో బాలీవుడ్ యాక్టర్ అనిల్ కపూర్ నటించడం లేదనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ చిత్రాన్ని త్వరలోనే పట్టాలెక్కించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Exit mobile version