
మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “ఆచార్య”. మంచి అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం తాలుకా షూట్ ఇప్పుడు శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ షూట్ నిమిత్తం మేకర్స్ లేటెస్ట్ గా మారేడుమిల్లి అడవుల్లో ఓ కీలక షెడ్యూల్ కోసం వెళ్లిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ చిత్రంలో సాలిడ్ రోల్ చేస్తున్న మెగా తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాను కూడా ఇటీవలే షూట్ లో జాయిన్ అయ్యాడు. అయితే మరి ఫైనల్ గా ఈ షెడ్యూల్ లో మెగాస్టార్ కూడా జాయిన్ అయ్యేందుకు రాజమండ్రి తరలి వెళ్లగా అక్కడి మెగా అభిమాన జనం గ్రాండ్ వెల్కమ్ ను తనకి అందించారు. దీనితో ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో మరియు మెగా ఫ్యాన్స్ లో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ భారీ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.