‘భలే భలే మగాడివోయ్’ ఆడియోకి మెగా హీరో.?

‘భలే భలే మగాడివోయ్’ ఆడియోకి మెగా హీరో.?

Published on Aug 13, 2015 7:38 PM IST

Nani-and-Lavanya
రీసెంట్ టైంలో టాలీవుడ్ లో చిన్న బడ్జెట్ తో కూడా ఓ పెద్ద హిట్ కొట్టచ్చు అని నిరూపించిన డైరెక్టర్ మారుతి. తను చేసిన ఈ రోజుల్లో, బస్ స్టాప్, ప్రేమకథా చిత్రమ్, కొత్త జంట సినిమాలు తక్కువ బడ్జెట్ లో వచ్చి పెద్ద హిట్ అయ్యాయి. మారుతి నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ ‘భలే భలే మగాడివోయ్’. యంగ్ హీరో నాని – లావణ్య త్రిపాటి జంటగా నటించిన ఈ సినిమా షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా దాదాపు పూర్తి చేసుకుంది. గోపి సుందర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియోని ఆగష్టు 15న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియో లాంచ్ కి ముఖ్య అతిధిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మారుతికి అల్లు అర్జున్ తో, అతని ఫ్యామిలీతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మారుతి మొదటి సినిమా ‘ఈ రోజుల్లో’ టైంలో కూడా అల్లు అర్జున్ ఆడియో లాంచ్ కి వచ్చి మారుతికి పుఫ్ సపోర్ట్ ఇచ్చాడు. దానికి తోడు ఈ సినిమా నిర్మాణ సంస్థల్లో గీత ఆర్ట్స్ 2 బ్యానర్ కూడా ఒక భాగం కావడం వలన కచ్చితంగా అల్లు అర్జున్ హాజరవుతాడని అంటున్నారు. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ వారు యువి క్రియేషన్స్ బ్యానర్ తో కలిసి చేసిన సినిమా ఇది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు