
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ సాయిధరమ్ తేజ్ చాలా విషయాల్లో చిరంజీవిని ఫాలో అవుతున్నాడని అనిపిస్తోంది. ఎందుకంటే చిరులానే సాయిధరమ్ తేజ్ రెండవ సినిమా మొదట రిలీజ్ అయ్యి ఆ తర్వాత ఫస్ట్ మూవీ రిలీజ్ అయ్యింది. ఇప్పుడు తన తదుపరి సినిమాకి ఒకప్పటి ఆయన బిరుదునే సినిమా పేరుగా వాడుకోవడానికి సిద్దమయ్యాడు. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ తిక్క సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో పాటే త్వరలోనే దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేయనున్న సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడు.
ఈ సినిమా కోసం క్రేజీ టైటిల్ ని అనుకున్నారు. అదే ‘సుప్రీమ్ (ఏసి,డిటిఎస్)’. ఒకప్పుడు చిరంజీవిని సుప్రీం హీరో అనేవారు ఇప్పుడు అదే పేరుని తన సినిమాకి టైటిల్ గా మార్చుకున్నాడు సాయిధరమ్ తేజ్. టౌన్ ఏరియాల్లో ఒక సినిమా ఒక థియేటర్ పేరులా ‘సుప్రీమ్ (ఏసి,డిటిఎస్)’ అని వచ్చేలా ఈ పేరుని పెట్టడం అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను చివరి దశకు తీసుకు వచ్చిన ఈ సినిమా కోసం నటీనటుల్ని కూడా ఎంపిక చేస్తున్నారు. అనిల్ రావిపూడి మొదటి సినిమాలానే ఈ సినిమాని కూడా ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉండేలా ప్లాన్ చేసినట్లు సమాచారం.

