‘మెగా విక్టరీ మాస్ సాంగ్’కు డేట్ ఫిక్స్..!

Mana Shankara Varaprasad

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తుండగా ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కేమియో రోల్‌లో నటిస్తుండటంతో ఈ మూవీ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందా అని ఫ్యాన్స్ ఆతృతగా చూస్తున్నారు.

అయితే ఈ సినిమా నుంచి ఇప్పుడు వరుస అప్డేట్స్ ఇస్తూ మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటికే రెండు సింగిల్ సాంగ్స్ రిలీజ్ చేసిన మేకర్స్, ఇప్పుడు తాజాగా ఈ చిత్రం నుంచి మూడో సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ‘మెగా విక్టరీ మాస్’(Mega Victory) సాంగ్‌ను డిసెంబర్ 30న రిలీజ్ చేస్తుండగా ఈ సాంగ్ ప్రోమోను రేపు(డిసెంబర్ 27) రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

మరి ఈ సాంగ్‌తో శంకర వరప్రసాద్ గారు ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ప్రొడ్యూ్స్ చేస్తున్నారు.

Exit mobile version