గ్యాంగ్ లీడర్ ‘చిరు’తో స్టెప్పేయించిన నిహారిక.!

niharika chiru

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి ఇంట ఇప్పుడు పెళ్లి సంబరాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తన సోదరుడు నాగబాబు కుమార్తె ప్రముఖ నటి నిహారికకు చైతన్య జొన్నలగడ్డ కు ఈరోజు వివాహం జరుగుతుండగా మొత్తం మెగా ఫ్యామిలీ అంతా ఒక రేంజ్ లో తమ ఇంటి ఆడపిల్ల వివాహ వేడుకను చేస్తున్నారు. ముఖ్యంగా చిరు అయితే మరీను.

తనదైన ఎనర్జీతో ఫుల్ స్వింగ్ లో మెగాస్టార్ ఈ వేడుకలో పాల్గొన్నారు. అయితే మన టాలీవుడ్ లో గ్యాంగ్ లీడర్ అంటే మొట్ట మొదటగా గుర్తుకు వచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి. మరి అదే పాటకు గాను నిహారిక చిరుతో కలిసి తన పెళ్లి వేడుకల్లో స్టెప్పేయించడం మెగా ఫ్యాన్స్ కు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అలాగే నాగబు కూడా అంతే స్వింగ్ లో కలిసి డాన్స్ చేసారు. ఇప్పుడు ఈ వీడియోనే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Exit mobile version