మన టాలీవుడ్ లెజెండరీ నటులు మెగాస్టార్ చిరంజీవి అలాగే కోలీవుడ్ తలైవర్ సూపర్ స్టార్ రజిని కాంత్ ల స్టార్డం కానీ వారై సినిమాలు సృష్టించే ప్రభంజనం కానీ వర్ణనాతీతం. వీరి సినిమా వస్తుంది అంటే బాక్సాఫీస్ షేక్ కావాల్సిందే. కానీ ఈ ఇద్దరి సినిమాలు ఒకే సారి వస్తే అన్న ఆలోచనే పెద్ద సంశయంలోకి నెట్టేస్తుంది.
అయితే పరిస్థితులు కనుక అనుకూలించకపోతే బాక్సాఫీస్ దగ్గర వీరిద్దరికీ సమరం తప్పదనే తెలుస్తుంది. ఇప్పుడు మెగాస్టార్ చిరు బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” అనే పవర్ ఫుల్ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నారు. పైగా ఈ చిత్రంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కనిపిస్తారని టాక్ వినిపిస్తుంది. దీనితో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అలాగే సూపర్ స్టార్ రజినీ కోలీవుడ్ స్టార్ దర్శకుడు శివతో “అన్నాత్తే” అనే సినిమాను ఈ మధ్యనే అనౌన్స్ చేసి దానిని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోనే ఉంచుతామని ముందుగానే చెప్పేసారు. అలాగే ఆచార్య కూడా అదే సంక్రాంతి బరిలో ఉండే అవకాశాలు ఉన్నాయని ఊహాగాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజం అయితే ఆ సమయంలో బాక్సాఫీస్ దగ్గర భీకర పోరు తప్పదని చెప్పాలి.
