వైరల్ పిక్ : గుణశేఖర్ కుమార్తె వివాహానికి హాజరైన మెగాస్టార్ దంపతులు


టాలీవుడ్ ప్రముఖ దర్శకడు గుణశేఖర్ మన తెలుగు ప్రేక్షకులకి ఎంతో సుపరిచితం. తొలిసారిగా లాఠీ మూవీ ద్వారా ఆయన డైరెక్టర్ గా మెగాఫోన్ పట్టారు. ఆ తరువాత మెగాస్టార్ తో చూడాలని ఉంది, మహేష్ బాబు తో ఒక్కడు, అనుష్క తో రుద్రమదేవి వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ లు తీశారు. ప్రస్తుతం సమంత తో శాకుంతలం అనే మైథలాజికల్ మూవీ తీస్తున్నారు గుణశేఖర్.

కాగా నిన్న రాత్రి ఆయన పెద్ద కుమార్తె నీలిమ గుణ వివాహం హైదరాబాద్ లోని తాజ్ ఫలక్నుమా ప్యాలెస్ లో ఎందరో అతిరథమరతుల సమక్షంలో ఎంతో వైభవంగా జరిగింది. కాగా ఈ వివాహ వేడుకకి పలువురు చిత్ర రంగ ప్రముఖులతో పాటు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులిద్దరూ ప్రత్యేకంగా విచ్చేసి నూతన వధూవరులైన నీలిమ, రవి లను ఆశీర్వదించారు. కాగా మెగాస్టార్ దంపతులు నీలిమ గుణ వివాహానికి విచ్చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version