ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా పలు సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమాలు దీనికి ముందు సినిమాల విషయంలో కానీ సోషల్ మీడియాలో పలు మార్లు నెగిటివ్ అటాక్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే తనపై జరిగే సోషల్ మీడియా అటాక్ పై మెగాస్టార్ స్పందించడం వైరల్ గా మారింది.
చాలా మంది తనపై అంత నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉంటానని అడిగేవారని.. నేను చేసిన మంచి అందుకున్న ప్రేమ నాకు కవచం అవే రక్షగా ఉంటాయని మెగాస్టార్ తెలిపారు. దీనితో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. మెగాస్టార్ మెగా ఫీనిక్స్ బ్లడ్ డోనేషన్ క్యాంప్ లో పాల్గొనగా అక్కడ మీడియాతో ఈ విషయాన్ని పంచుకున్నారు. ఇక ఇదే ఈవెంట్ లో తేజ సజ్జ, సంయుక్త మీనన్ లు కూడా హాజరయ్యారు.
