మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు నటిస్తున్న అవైటెడ్ చిత్రాల్లో దర్శకుడు కొల్లి బాబీతో చేస్తున్న క్రేజీ యాక్షన్ డ్రామా కాకా కూడా ఒకటి. మంచి హైప్ సెట్ చేసుకున్న ఈ సినిమా పనులు జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్నాయి. అయితే ఈ చిత్రం విడుదల విషయంలో మేకర్స్ పక్కా క్లారిటీ గా ఉన్నారు.
అయితే మేకర్స్ ఏ రేంజ్ లో స్పీడ్ గా ఉన్నారంటే ఆల్రెడీ సినిమా డబ్బింగ్ పనులు కూడా మొదలు పెట్టేసినట్టుగా మేకర్స్ ఇప్పుడు ఖరారు చేశారు. దీనికి సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా చేస్తున్నట్టుగా వీడియో వదిలారు. దీనితో కాకా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆన్ టైం రావడం గ్యారెంటీ అని చెప్పొచ్చు.
ఇక ఈ చిత్రంలో యంగ్ హీరోయిన్ అనశ్వర రంజన్ కీలక పాత్ర పోషించగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే కే వి ఎన్ ప్రొడక్షన్స్ తెలుగులో తమ మొదటి సినిమాగా గ్రాండ్ గా తెరకెక్కించి జనవరి 13న విడుదలకి తీసుకొస్తున్నారు.
The dubbing works of #KAAKA commence with a divine pooja ceremony. 🎙️✨
With the shoot and post-production progressing simultaneously, the team is working at full speed to set THE BLOODY BENCHMARK 🪓🔥
Worldwide Grand Release on January 13th, 2027❤️🔥
A @dirbobby Film 💥… pic.twitter.com/gkwkWUaRGV
— KVN Productions (@KvnProductions) September 25, 2026
