మన టాలీవుడ్ లో లెజెండరీ హీరో అయినటివంటి బాక్సాఫీస్ బాద్షా మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో ఎన్నో రికార్డ్ బ్రేకింగ్ సినిమాలు ఉన్నాయి. ఒకప్పుడు ఒక్కో దర్శకునితో ఒక్కో రకమైన సినిమాలను చేస్తూ కనక వర్షం కురిపించారు. మరి అలా మెగాస్టార్ చేసిన కొన్ని అదిరిపోయే సినిమాలను ఇప్పుడున్న స్టార్ హీరోలలో ఎవరెవరు చేస్తే బాగుంటుందో అన్నది తన లేటెస్ట్ షో సామ్ జామ్ లో రివీల్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
దానికి సంబంధించి ఓ వీడియో కూడా వైరల్ అవుతుంది. సమంతా హోస్ట్ గా మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ “ఆహా” లో మెగాస్టార్ తో ప్లాన్ చేసిన ఈ మెగా ఎపిసోడ్ లో తన సినిమాలకు గాను చరణ్, తారక్, బన్నీ, ప్రభాస్ ఇలా అందరి స్టార్ హీరోల పేర్లను కవర్ చేసేసారు. మరి తన సినిమాల్లో ఏ హీరోకు ఎవరి పేరు సెట్టవుతుందో అన్నది తెలియాలి అంటే మాత్రం ఈ డిసెంబర్ 25న ఎక్స్ క్లూజివ్ గా స్ట్రీమ్ కానున్న ఈ మెగా ఎపిసోడ్ ను చూడాల్సిందే.
