సమంత షోలో మెగాస్టార్ మామూలు ఎంటర్టైన్మెంట్ ఇవ్వరట!

sam chiru

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి స్టార్ హీరోయిన్స్ లో తన సినిమాలకంటూ ఒక మార్కెట్ ను ఏర్పర్చుకున్న వారిలో సమంతా కూడా ఒకరు. అయితే లేటెస్ట్ గా సమంతా మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ అయినటువంటి “ఆహా”లో “సామ్ జామ్ విత్ సమంతా” అనే ఒక సెలెబ్రెటీ టాక్ షో ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ఈ షోకు గాను చాలా మందే టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు. అలా హాజరయిన వారిలో మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. అయితే మెగాస్టార్ చిరంజీవి తో ప్లాన్ చేసిన ఈ ఎపిసోడ్ లో చిరు గట్టి ఎంటర్టైన్మెంట్ నే ఇవ్వనున్నారట.

పలు షోలలో చిరు టైమింగ్ ఏపాటిదో మనం చూసాము కానీ ఇందులో అంతకు మించి వచ్చినట్టు తెలుస్తుంది. అంతే కాకుండా చిరు చేసిన పలు సేవా కార్యక్రమాలకు సంబంధించి కూడా ఎమోషనల్ క్లిప్స్ కూడా ఈ ఎపిసోడ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఈ మెగా ఎపిసోడ్ ను మాత్రం ఎక్స్ క్లూజివ్ గా “ఆహా”లో ఈ క్రిస్మస్ సందర్భంగా ప్లాన్ చేయనున్నారని సమాచారం.

Exit mobile version