మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ప్రపంచవ్యాప్తంగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా ఇప్పటికే మొదటి షో కి సంబంధించిన టాక్ బయటకి రావడం జరిగింది. సైరా మూవీ చూసిన ప్రేక్షకులు అలాగే ఫిల్మ్ క్రిటిక్స్ పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. దీంతో మెగా అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. థియేటర్ల వద్దకు చేరుకుని టపాసులుకాలుస్తు డ్యాన్స్‌లు చేస్తున్నారు. థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. కొన్ని థియేటర్ల వద్ద మెగాస్టార్ చిరంజీవి భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. మరికొన్నిచోట్ల మెగాస్టార్ కటౌట్లకు పాలాభిషేకాలు చేస్తున్నారు.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాన్ని దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించగా రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించారు. చిరు కి జంటగా నయనతార నటించిన చిత్రంలో అమితాబ్ బచ్చన్, తమన్నా, విజయ్ సేతుపతి, జగపతిబాబు, సుదీప్ కీలక పాత్రలు పోషించారు.
