శ్రీహరి జయంతి సందర్భంగా మేఘాంశ్ శ్రీహరి కొత్త చిత్ర ఫస్ట్ లుక్ విడుదల!

దివంగత నటుడు శ్రీహరి జయంతి సందర్భంగా ఆయన తనయుడు మేఘాంశ్ శ్రీహరి కథానాయకుడిగా నటిస్తున్న నూతన చిత్ర ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. భైరవకాళి ఫ్లిక్స్ పతాకంపై లెల్లా రాహుల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి లెల్లా రోహిత్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా పోతురాజు ఆహార్యంలో ఉన్న మేఘాంశ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

ఈ సినిమా ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. కథా నేపథ్యాన్ని పరిచయం చేస్తూ త్వరలోనే టైటిల్ గ్లింప్స్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు మేకర్స్ తెలిపారు.

Exit mobile version