విడుదల తేదీ : మార్చి 06, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు : శ్రీనాధ్ మాగంటి, గాయత్రి రమణ, కామాక్షి భాస్కర్ల, మురళీధర్ గౌడ్, రాజ్ కుమార్, సాయి ప్రసన్న తదితరులు
దర్శకుడు : బాల సతీష్
నిర్మాత : రాజేష్ కుమార్
సంగీత దర్శకుడు : సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రాఫర్ : అమ్మముత్తు. కే
ఎడిటర్ : గారీ బి హెచ్
సంబంధిత లింక్స్ :ట్రైలర్
బాల సతీష్ దర్శకత్వంలో శ్రీనాధ్ మాగంటి, గాయత్రి రమణ హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా ‘మెన్షన్ హౌస్ మల్లేష్’. కాగా ఈ చిత్రం ఈ రోజు రిలీజ్ అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథ
మల్లేష్( శ్రీనాధ్) చిన్నప్పటి నుంచి తండ్రి చేతుల్లో దెబ్బలు తింటూ చివరకు ఇంటి నుంచి పారిపోతాడు. ఆ తర్వాత ఆల్కహాల్ తాగుతూ పెరిగి పెద్దవుతాడు. మరోవైపు తన ఊరి పటేల్(రాజేష్ ) కి మల్లేష్ కి గొడవ ఉంటుంది. ఒకరంటే ఒకరికి అసలు పడదు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో మల్లేష్ కి జ్యోతి (గాయత్రి రమణ) తో పెళ్లి జరుగుతుంది. ఒకరంటే ఒకరికి ప్రాణం. కానీ ఆ ఇద్దరి కాపురంలో వచ్చిన సమస్య ఏమిటి ?, అసలు మల్లేష్, పటేల్ కి మధ్య గొడవ ఎందుకు ?, ఈ మధ్యలో పటేల్ భార్య పద్మ ( కామాక్షి భాస్కర్ల) పోషించిన పాత్ర ఏంటి ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో కామెడీ టచ్ బాగుంది. ఓపెనింగ్ నుంచి హీరో క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేసిన విధానం బాగుంది. ముఖ్యంగా మల్లేష్, అతనితో గొడవ పడే చిన్న పటేల్ పాత్ర మధ్య నడిచే సన్నివేశాలు బాగున్నాయి. అలాగే, తెలంగాణ పల్లె వాతావరణం, మాండలికం ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి. మొత్తమ్మీద ఈ సినిమాలో ఫన్ తో పాటు కొన్ని చోట్ల ఎమోషన్ కూడా బాగానే వర్కౌట్ అయ్యింది. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ కూడా బాగుంది.
ప్రధాన పాత్రలో నటించిన శ్రీనాధ్ మాగంటి తన పాత్రలో ఒదిగిపోయారు. సీరియస్ సిచ్యుయేషన్స్ లో కూడా తన టైమింగ్ తో ‘మల్లేష్’ పాత్రను ఆయన చాలా బాగా పండించారు. ముఖ్యంగా శ్రీనాధ్ మాగంటి డైలాగ్స్, ఆయన హావభావాలు బాగానే నవ్వు తెప్పించాయి. ఎమోషనల్ టోన్ లో నడిచిన భార్య పాత్రలో గాయత్రి రమణ ఆకట్టుకుంది. కామాక్షి భాస్కర్ల నటన చాలా బాగుంది. ఇతర కీలక పాత్రల్లో నటించిన మురళీధర్ గౌడ్, రాజ్ కుమార్, సాయి ప్రసన్న మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.
మైనస్ పాయింట్స్ :
బాల సతీష్ తీసుకున్న కథాంశం, మరియు మల్లేష్ – చిన్న పటేల్ పాత్రలు బాగున్నప్పటికీ.. కథనం మాత్రం కొన్ని చోట్ల సింపుల్ గా చాలా స్లోగా సాగుతుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్ కలిగించలేని ట్రీట్మెంట్ తో సిల్లీగా సాగుతుంది. పైగా కీలక సన్నివేశాలు కూడా లాజికల్ గా కనెక్ట్ కావు. ముఖ్యంగా హీరోయిన్ పాత్రతో పాటు ఆమె తల్లిదండ్రుల పాత్రలను కూడా ఇంకా బలంగా రాసుకోవాల్సింది.
అలాగే, కాపురం విషయంలో మెప్పించలేకపోయిన ఓ భర్త కోణంలో నడిచే డ్రామా కూడా ల్యాగ్ అయ్యింది. నిజానికి సంసారానికి పనికిరాని ఓ వ్యక్తి మనస్తత్వం ఎలా ఉంటుంది ?, అతని ప్రవర్తన ఎలా మారిపోతుంది ? వంటి అంశాలను ఇంకా ఎఫెక్టివ్ గా చూపించి ఉండి ఉంటే బాగుండేది. ఓవరాల్ గా దర్శకుడు స్క్రిప్ట్ లో ఉన్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేసినా.. సినిమాలో కొన్ని రొటీన్ అండ్ బోరింగ్ సీన్స్ ను ఎంటర్ టైన్ గా మలచలేకపోయారు.
సాంకేతిక విభాగం :
సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. బాల సతీష్ దర్శకుడిగా ఆకట్టుకున్నా.. స్క్రీన్ ప్లే పరంగా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి అందించిన పాటలు పర్వాలేదు. అదే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో పర్వాలేదు. ఇక ఎడిటర్ అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాత రాజేష్ కుమార్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు:
‘మెన్షన్ హౌస్ మల్లేష్’ అంటూ వచ్చిన ఈ ఫ్యామిలీ ఫన్ డ్రామాలో.. మెయిన్ థీమ్, ఫస్ట్ హాఫ్ లో కొన్ని కామెడీ సీన్స్ బాగానే ఉన్నాయి. ఐతే, మెయిన్ ట్రీట్మెంట్ ఆసక్తికరంగా సాగకపోవడం, సెకండాఫ్ బోరింగ్ ప్లేతో స్లోగా సాగడం, ప్రధాన పాత్రలు బలంగా లేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. ఓవరాల్ గా ఈ సినిమా మాత్రం ఆకట్టుకోలేదు.
123telugu.com Rating: 2.25/5
Reviewed by 123telugu Team
