మహేశ్ ‘బ్రహ్మోత్సవం’కు మిక్కీ మ్యూజిక్?

micky-j
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న సినిమా.. ‘బ్రహ్మోత్సవం’. మే నెలలో ఈ సినిమా షూటింగ్‌కు ముహూర్తం ఖరారు చేశారు. పీవీపీ సినిమా పతాకంపై ప్రసాద్ వి. పొట్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి టెక్నికల్ టీమ్ వివరాలు ఇంకా ప్రకటించలేదు.

అయితే.. ప్రస్తుత సమాచారం మేరకు మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చనున్నట్లు తెలుస్తోంది. మిక్కీ గతంలో మహేష్ సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రానికి చక్కటి పాటలు సమకూర్చి ఆల్బంను సూపర్ హిట్‌గా నిలిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు బ్రహ్మోత్సవం సినిమాకి కూడా మిక్కీ పేరునే ఖరారు చేశారని టాక్. సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది.

Exit mobile version