ఓటీటీలో సెన్సేషనల్ హిట్ అయ్యిన ఇండియన్ కంటెంట్ లో మీర్జాపూర్ అనే సిరీస్ కూడా ఒకటి. పంకజ్ త్రిపాఠి, దివ్యెందు శర్మ అలాగే అలీ ఫజల్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ అదే నటుల కలయికలో సినిమాగా కూడా తెరకెక్కి బిగ్ స్క్రీన్స్ పై అలరించడానికి కొన్ని రోజులు కితం వచ్చింది.
అయితే బిగ్ స్క్రీన్స్ పై కూడా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా గ్రాండ్ గా తెలుగులో కూడా విడుదల అయ్యింది. కానీ తెలుగులో కూడా హిట్ అవుతుంది అనుకున్న ఈ సినిమాకి మన దగ్గర ఆదరణ మాత్రం కరువయ్యింది. మెయిన్ గా ప్రమోషన్స్ లాంటివి ఏమీ చేయకుండా లైట్ తీసుకోవడంతో మన దగ్గర ప్లాప్ గానే నిలిచిన ఈ సినిమా హిందీలో మాత్రం దంచి కొడుతోంది.
అక్కడ ఏకంగా 150 కోట్లకి పైగా నెట్ వసూళ్ల మార్క్ ని ఈ సినిమా అందుకోవడం విశేషం. అక్కడ హనుమాన్ ఆన్శ్ లాంటి సినిమా ఉన్నప్పటికీ మీర్జాపూర్ మంచి వసూళ్లతో స్టడీగా వెళుతుంది. మరి లాంగ్ రన్ లో 200 నుంచి 250 కోట్ల వరకు వెళ్లే సూచనలు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. తెలుగులో లిమిటెడ్ రిలీజ్ చేయడం కూడా ఎఫెక్ట్ కావచ్చు. సో ఈ సినిమా ఎక్కడ వరకు వెళుతుందో చూడాలి.
