తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘జైలర్ 2’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ క్రేజీ సీక్వెల్ మూవీతో రజినీకాంత్ మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక ఈ సినిమాలో పలువురు స్టార్స్ క్యామియో రోల్స్ చేయనున్న సంగతి తెలిసిందే. తొలి భాగంలో నటించిన శివ రాజ్‌కుమార్, మోహన్ లాల్‌తో పాటు బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రబర్తి కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. అయితే, ఆయన జైలర్ 2 సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు.
ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్, మోహన్ లాల్, రమ్యకృష్ణలతో పాటు షారుక్ ఖాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో ఈ సినిమాలో షారుక్ ఖాన్ నటిస్తున్నట్లు వస్తున్న వార్తలకు బలం చేకూరినట్లు అయింది. మరి ఈ విషయంపై అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందో చూడాలి.
