సూపర్‌స్టార్ రజినీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబోలో అక్టోబర్ 15న రాబోతున్న ‘జైలర్ 2’ నుండి ఫస్ట్ సింగిల్ సాంగ్ ‘అలా బొలేలో’ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. అనిరుధ్ స్వరపరిచిన ఈ మలయాళ శైలి ఐటమ్ సాంగ్‌లో నటి పూర్ణ డాన్స్, రజినీకాంత్ స్వాగ్ వాక్ హైలైట్‌గా నిలిచాయి. ఈ పూర్తి పాటను ఆగస్టు 21న విడుదల చేయనున్నారు.
అయితే మొదటి భాగంలోని ‘కావాలయ్య’ పాటలో తమన్నా క్రేజ్ తెచ్చినంత మైలేజ్ పూర్ణ తెలేకపోవచ్చని, అలాగే అనిరుధ్ వాయిస్ అంత క్యాచీగా లేదంటూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. కేవలం గ్లింప్స్ ఆధారంగానే అంచనా వేయలేమని, ఆగస్టు 21న ఫుల్ సాంగ్ వచ్చాక ఇది ‘కావాలయ్య’ స్థాయి వైరల్ హిట్ అవుతుందో లేదో చూడాలని భావిస్తున్నారు.
Ala Bolelo fever is about to begin in 2 days! 🤩🪘#Jailer2 First Single #AlaBolelo is releasing on Aug 21 🔥@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @shamna_kkasim @vijaykartikdop @Nirmalcuts @ChethanDsouza @AlwaysJani @KiranDrk #PallaviSingh @valentino_suren… pic.twitter.com/7nfjXHf0vM
— Sun Pictures (@sunpictures) August 19, 2026
