పురాణపండ స్విచ్ ఆన్ , కీరవాణి క్లాప్ తో వారాహి, క్రిష్ చిత్రం ప్రారంభం

Puranapanda Srinivas, M. M. Keeravani, Vaaraahi Chalana Chitram, Ustaad

హైదరాబాద్ : మే 26

ప్రముఖ సంగీత దర్శకులు ఎం.ఎం. కీరవాణి కుమారుడు శ్రీసింహా కోడూరి హీరోగా కొత్త చిత్రం ‘ఉస్తాద్’ గురువారం హైద‌రాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ప్రఖ్యాత చలన చిత్రనిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం మరొక నూతన నిర్మాణ సంస్థ క్రిష్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సామ్యుల్తంగా నిర్మిస్తున్న ఈ నూతన చిత్ర ముహూర్తానికి కధానాయకుడు సింహ పై కీరవాణి క్లాప్ కొత్తగా, ప్రముఖ రచయిత , శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

ఈ కార్యక్రమంలో వారాహి చలన చిత్రనిర్మాణ సంస్థ అధినేతలు సాయి కొర్రపాటి, రజని కొర్రపాటి, కీరవాణి సతీమణి శ్రీమతి శ్రీవల్లి , కొమరం భీముడొ సాంగ్ ఫేమ్ కాలభైరవ, క్రిష్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత గడ్డం రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇటీవల కొన్ని చలన చిత్రాల నిర్మాతలు ఎక్కువగా ప్రముఖరచయిత పురాణపండ శ్రీనివాస్ ని తమ కార్యక్రమాలకు ముఖ్య అతిధిగా ఆహ్వానిస్తున్నారు. శ్రీనివాస్ స్వచ్ఛమైన మనస్సు , ప్రజ్ఞ , శ్రమపడేతత్వం, నలుగురికీ మేలుచేసేగుణం … ఇవన్నీ వారిని ఎక్కువగా ఆకట్టుకుంటోందని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా వచ్చే నేలనుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని నిర్మాతలు తెలిపారు.

Exit mobile version