7000 స్క్రీన్లలో విడుదలకానున్న ‘బాహుబలి-2’ !

విడుదలైన ప్రతి చోట ఘనమైన విజయాన్ని సొంతం చేసుకుని ప్రపంవ్యాప్తంగా రూ.1600 కోట్లకు పైగానే వసూళ్లను చేజిక్కించుకున్న ‘బాహుబలి-2’ చిత్రం రేపు చైనాలో కూడ విడుదలకానుంది. చైనాలో ఐమాక్స్ ఫార్మాట్లో విడుదలవుతున్న ఇండియన్ సినిమాగా ఇప్పటికే రికార్డ్ సృష్టించిన ఈ చిత్రం 7000లకు పైగా స్క్రీన్లలో విడుదలకానుంది.

ఇప్పటికే 2.5 లక్షల డాలర్ల ప్రీ రిలీజ్ సేల్స్ జరిపిన ఈ సినిమా భారీ స్థాయి ఓపెనింగ్స్ సాధించనుంది. ఈ కలెక్షన్లతో బాహుబలి-2 వసూళ్ల మొత్తం ఇంకా పెరగనున్నాయి. ఇకపోతే ఇటీవలే జపాన్ లో ఈ చిత్రం 100 రోజుల రన్ పూర్తిచేసుకుని 1.3 మిలియన్ డాలర్ల గ్రాస్ ను రాబట్టి ఇప్పటికీ కొన్ని ఏరియాల్లో
దిగ్విజయంగా నడుస్తోంది.

Exit mobile version