పుట్టిన రోజు జరుపుకొంటున్న తమన్నా

ఈ తరం కథానాయికల లో “మిల్క్ వైట్ బ్యూటి” గా పేరొందిన ఒకే ఒక తార తమన్నా. ఈ తార ఈరోజు తన 22 వ పుట్టిన రోజు జరుపుకుంటుంది. ౧౯౮౯ డిసెంబర్ 21 న మహా రాష్ట్ర లో సింది కుటుంబం లో జన్మించిన తమన్నా తన చిన్నతనాన్ని ముంబై లో గడిపింది. “శ్రీ” చిత్రం తో తెలుగు చిత్ర పరిశ్రమ కి పరిచయం అయ్యింది. కాని తన మొదటి విజయం శేకర్ కమ్ముల చేసిన “హ్యాపీ డేస్” చిత్రం తో వచ్చింది. ఈ చిత్రం తో తెలుగు ప్రజలకి బాగా చేరువయ్యింది. తమన్నా తమిళ పరిశ్రమ లో కూడా మంచి పేరు తెచ్చుకుంది. స్నేహభావము మరియు కష్టపడే తత్వం తనని ఈ స్థాయికి తీసుకు వచ్చింది. తను తెలుగు బాగా మాట్లాడగలదు.

123 తెలుగు.కం తరుపున తమన్నా కి పుట్టిన రోజు శుభాకాంక్షలు

Exit mobile version