ఇండస్ట్రీకి ‘అ !’ లాంటి సినిమాలు అవసరం – నాని

హీరోగా విజయవంతంగా కెరీర్ కొనసాగిస్తున్న నాని ఇంకో అడుగు మందేసి చేసిన నిర్మాతగా మారి తన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నిర్మించిన సినిమా ‘అ !’. టైటిల్ ప్రకటించిన దగ్గర్నుండి ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. నాని కూడా సినిమా మొదలైన తొలిరోజు నుండి ఇది రెగ్యులర్ సినిమా కాదు విభిన్నమైన చిత్రమని చెబుతూ వచ్చారు.

మరి నిర్మాతగా తొలి సినిమా కమర్షియల్ గా వర్కవుట్ అయ్యేలా చేయకుండా ఇంత భిన్నమైన సబ్జెక్ట్ ఎందుకు తీసుకున్నారనే ప్రశ్నకు సమాధానంగా రెగ్యులర్ కమర్షియల్ సినిమా అయితే ఎవరైనా తీస్తారు, కానీ ఇలాంటి డిఫరెంట్ సబ్జెక్ట్స్ కు ఎవరూ ముందుకురారు. వాళ్ళ కోసం వెయిట్ చేయడంకన్నా నేనే ముందుగా ప్రయత్నిస్తే బాగుంటుందని చేశాను.

తెలుగు ప్రేక్షకులు కొత్త సినిమాల్ని కోరుకుంటున్నారు, పైగా పరిశ్రమకి కూడా ఇలాంటి సినిమాలు చాలా అవసరం అందుకే చేశాను అన్నారు నాని. రేపే విడుదలకానున్న ఈ సినిమాను నూతన దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్టర్ చేశారు.

Exit mobile version