
నిఖిల్ స్వాతి జంటగా నటించిన ‘కార్తికేయ’ నిర్మానంతరపు పనులు చివరి దశ కు చేరుకున్నాయి. చందు మొన్దేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వెంకట శ్రీనివాస్ బొగ్గరం మాగ్నస్ సినీప్రైమ్ లిమిటెడ్ బ్యానర్ పై రాజ్ వర్మ ఎంటర్టైన్మెంట్ సహకారం తో సమర్పిస్తున్నారు. వరుసగా హత్యలు జరిగే ఒక పల్లెటూరి నేపధ్యం లో నడిచే ఈ చిత్రం లో నిఖిల్ ఒక మెడికో పాత్ర పోషిస్తున్నాడు. ‘స్వామి రా రా’ చిత్రం లో అలరించిన నిఖిల్ స్వాతి ఈ చిత్రం లో మరో సారి జత కట్టారు. ఈ నెలలో చిత్రం ఆడియో విడుదల కానుండగా నిర్మాతలు ఈ చిత్రాన్ని జూన్ మొదటి వారం లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
శేఖర్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని ఛాయాగ్రహణం అందించారు. ఈ చిత్రం తమిళ్ మరియు తెలుగు భాషల్లో విడుదల కానుంది.