ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ : రికార్డులు తిరగ రాసేందుకు డేట్ ఫిక్స్..!

Ustaad Bhagat Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh ) కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండటంతో అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఈ కాంబినేషన్‌లో వచ్చిన ‘గబ్బర్‌సింగ్’ ఇండస్ట్రీ హిట్‌గా నిలవడంతో ఇప్పుడు మరోసారి ఆ మ్యాజిక్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’తో రిపీట్ చేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే, ఈ సినిమా రిలీజ్ డేట్‌కు సంబంధించి మేకర్స్ తాజాగా ఓ క్లారిటీ ఇచ్చారు.

‘ఉస్తాద్ భగత్‌సింగ్’ (Ustaad Bhagat Singh ) చిత్రాన్ని గతంలో వాయిదా వేశారు. దీంతో ఇప్పుడు ఈ చిత్రాన్ని మార్చి 26, 2026లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు. దీనికి సంబంధించిన రిలీజ్ డేట్ పోస్టర్‌ను వారు రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో పవన్ తనదైన వింటేజ్ పోజ్‌లో కనిపిస్తున్నారు. ఇక పవన్ లుక్స్ ఆకట్టుకునేలా ఉండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు.

ఈ సినిమాలో పవన్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. ఆయన సరసన అందాల భామలు శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక మార్చి 26న రిలీజ్ కానున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh ) బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

Exit mobile version