
మొదటిసారి యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల కలయికలో ఒక చిత్రం రూపొందనుంది. ఈ క్రేజీ కాంబినేషన్ మూలాన సినిమాపై ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. కొన్నాళ్ల క్రితమే పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా ప్రారంభమైన ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ ఈ నెల 13 నుండి హైదరాబాద్లో ప్రారంభంకానుంది.
ఈ షెడ్యూల్లో మొదటగా ఒక యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించనున్నారట. ఈ యాక్షన్ ఎపిసోడ్ ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్ ల నేతృత్వంలో జరగనుంది. ఈ నెల 25వరకు ఈ షెడ్యూల్ జరగనుంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించనుంది.