ప్రముఖ రెస్టారెంట్ బ్రాండ్ ‘శుద్ధ్ విలాస్’ అంతర్జాతీయ విపణిలోకి అడుగుపెట్టింది. హైదరాబాద్‌లోని మల్కాజిగిరిలో విజయవంతంగా నడుస్తున్న ఈ రెస్టారెంట్, తన రెండవ శాఖను మలేషియాలోని ‘సైబర్ జయ’ ప్రాంతంలో జనవరి 5న ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మలేషియా పార్లమెంట్ సభ్యులు దాతుక్ శరీ Dr. M. శరవణన్, నూతన శాఖను లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా శుద్ధ్ విలాస్ వ్యవస్థాపకులు శశికాంత్, శ్రీరామ్ మాట్లాడుతూ… మల్కాజిగిరిలో వినియోగదారుల ఆదరణ చూసిన తర్వాతే, అదే ఉత్సాహంతో మలేషియాలో అడుగుపెట్టామన్నారు. రుచికరమైన, నాణ్యమైన సౌత్ ఇండియన్ ఆహారాన్ని పరిశుభ్రమైన వాతావరణంలో (Hygiene Food) అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. త్వరలోనే దుబాయ్ సహా మరిన్ని దేశాల్లో తమ శాఖలను ఏర్పాటు చేసి, గ్లోబల్ చైన్ రెస్టారెంట్‌గా ఎదిగేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వారు వెల్లడించారు.
ఆరోగ్యకరమైన ఆహారానికి మలేషియాలో పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా, శుద్ధ్ విలాస్ రాకను స్వాగతిస్తున్నట్లు ఎంపీ శరవణన్ తెలిపారు. ఈ ప్రారంభోత్సవంలో రెస్టారెంట్ భాగస్వాములు, నిర్వాహకులు పాల్గొన్నారు.
