నాగ చైతన్యతో సినిమా ఉంటుందన్న దర్శకుడు !

Indraganti Mohan Krishna1
గత రెండేళ్లలో అక్కినేని హీరో నాగ చైతన్య కెరీర్ గ్రోత్ చాలా బాగుంది. నటుడిగా, మార్కెట్ పరంగా మంచి బెటర్మెంట్ కనబర్చారాయన. అందుకే ఆయనతో సినిమా చేయాలని చాలా మంది దర్శకులు వేచి చూస్తున్నారు. అలాంటి వారిలో మోహన్ కృష్ణ ఇంద్రగంటి కూడ ఒకరు. ‘గోల్కొండ హైస్కూల్, అమీ తుమీ, అష్టా చెమ్మా’ వంటి మంచి సినిమాలు తీసిన ఆయన చైతన్యతో సినిమా చేయాలని అనుకుంటున్నారు.

ఇప్పటికే పలుసార్లు చర్చలు కూడ జరిగాయని, ఇప్పటికీ ఆ ప్రపోజల్ ఉందని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు ఇంద్రగంటి. అంతేగాక చైతన్యతో ఒక యాక్షన్ సినిమా తీద్దామని అనుకున్నానని, కానీ ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘సవ్యసాచి’ అలాంటి సినిమానే కాబట్టి ప్లాన్ మార్చుకుని వేరే జానర్లో చేయాలని అనుకుంటున్నానని తెలిపారు. ఇకపోతే ఆయన నటించిన ‘సమ్మోహనం’ చిత్రం ఈ నెల 15న విడుదలకానుంది.

Exit mobile version