“టైగర్ నాగేశ్వరరావు” కోసం మోలీవుడ్ యంగ్ స్టార్.!

Tiger Nageswara Rao

ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “టైగర్ నాగేశ్వరరావు” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు మహేష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నిజ జీవిత సంఘటనల ఆధారంగా అయితే భారీ హంగులతో రాబోతుంది. ఇక మేకర్స్ అయితే సినిమా ఫస్ట్ లుక్ కె సాలిడ్ ప్లానింగ్స్ చేస్తుండగా నిన్ననే ఈ సినిమా కన్నడ ఫస్ట్ లుక్ ని అయితే స్టార్ హీరో శివ రాజ్ కుమార్ తో లాంచ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

ఇక ఇప్పుడు అయితే ఈ సినిమా మళయాళ లుక్ కి సంబంధించి అయితే అక్కడి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో మన రామ్.. దుల్కర్ సల్మాన్ అయితే తన వాయిస్ ఓవర్ లో పరిచయం చేయనున్నట్టుగా మేకర్స్ ఇప్పుడు కన్ఫర్మ్ చేశారు. మొత్తానికి అయితే ఒకో భాష నుంచి ఒకో స్టార్ నటునితో సాలిడ్ ప్లానింగ్ ని మేకర్స్ చేస్తున్నారు. ఇక ఇతర భాషలకి సంబంధించి అప్డేట్స్ రానున్నాయి.

Exit mobile version