రాజ్ వాడపల్లి, వంశీకృష్ణ, ప్రియా అగస్టి, కావ్య కీర్తి బండారి లు హీరో హీరోయిన్లుగా కుమార్ రాజేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మొనగాడెవరు`. హు ఈజ్ నెంబర్ వన్ ట్యాగ్ లైన్. మెగా ఆర్ట్స్ పతాకంపై వాడపల్లి జగన్నాథం సమర్పణలో రాజ్ వాడపల్లి ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవం సోమవారం హైదరాబాద్‌లో ని రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన `మా` అధ్యక్షుడు శివాజీరాజా తొలి సన్నివేశానికి క్లాప్ నివ్వగా ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ కెమేరా స్విచాన్ చేశారు. ప్రతాని రామకృష్ణ గౌడ్ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత రామ సత్యనారాయణ టైటిల్ లోగో లాంచ్ చేశారు.
చిత్ర దర్శకుడు కుమార్ రాజేంద్ర మాట్లాడుతూ సినిమా రంగంలో నిలదొక్కుకోవాలని వచ్చిన నలుగురు యువతీ యువకులు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? చివరికి వారి కోరిక నెరవేరిందా? లేదా అన్నది సినిమా కథాంశం. ఈచిత్రంలో బస్టాప్ కోటేశ్వరరావు, హేమసుందర్, శివ శంకర్ మాస్టర్, బిత్తిరి సత్తి, కృష్ణవేణి, రాగిణి, ఎన్టీఆర్ డూప్ గా భాస్కర్, చిరంజీవిగా డూప్ గా ధర్మతేజ, శోభన్ బాబు డూప్ గా వెంకటేశ్వరరావు, బాలకృష్ణ డూప్ గా రామకృష్ణ నటిస్తున్నారని తెలియజేశారు.
